Book Details
BACK
Title |
నాలడియార్ = நாலடியார் : (పదినెణ్ కీళ్ కణక్కు గ్రంథం) (Nālaṭiyār in Telugu) |
Author |
తెలుగు అనువాదం ఆచార్య శ్రీపాద జయప్రకాశ్ |
Publisher |
Chennai: Central Institute of Classical Tamil |
Publish Year |
2022 |
Language |
Kannada |
Book ISBN |
978-93-81744-75-8 (HB) |
Number of Pages |
227 |
Book Price |
Rs.350.00 |
About the Book:- |
ప్రాచీన తమిళ నీత్యుద్బోధక గ్రంథాలలో తిరుక్కురళ, నాలడియార్ ప్రపంచంలోనే తిరుగులేని గ్రంథాలుగా ప్రసిద్ధి చెందాయి. "నాలు ఇరండుం సొల్లుక్కు ఉరుది. ఆలుం, వేలుం పలుక్కు ఉరుది" అనే సామెత ఒకటి ప్రచారంలో ఉంది. నాలుం అంటే నాలుగు పాదాలు కలిగిన నాడియార్ అనీ, ఇరండుం అంటే రెండు పాదాలు కలిగిన తిరుక్కురళ్ అనీ, ఈ రెండు గ్రంథాలు మాటకు ఔన్నత్యాన్నీ, బలాన్నీ చేకూరుస్తాయనీ, మర్రి, తుమ్మ పంటికి బలాన్ని చేకూరుస్తాయనీ పై సామెత భావం. క్రీ.శ. మొదటి శతాబ్దానికి చెందినదిగా భావింపబడుతున్న నాలాడియార్ ఒక సంకలన గ్రంథం. జైన మునులు పెక్కు మంది రచించిన పద్యాల సంకలనం ఇది. నాలుగు పాదాలతో కూడిన పద్యాలను కలిగిన గ్రంథం కాబట్టి దీనికి 'నాలాడియార్' అనే పేరు వచ్చింది. 'అడి' అంటే తమిళంలో పాదం అని అర్థం. నాలడి (నాలు + అడి) అంటే నాలుగు పాదాలు అని అర్థం. ఈ గ్రంథంలో వెణ్బా ఛందస్సుతో రాయబడిన నాలుగువందల పద్యాలున్నాయి. మానవాళి ఆలోచనలను, కార్యాచరణలను పవిత్రం చేస్తూ ఆదర్శవంతమైన సమాజాన్ని రూపొందించడమే నాలడియార్ గ్రంథం ప్రధాన ఉద్దేశం. |